గత ఏడాది భాతరదేశం యొక్క జీడీపీ 7.2శాతంగా ఉందని హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేరేడ్ మెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ కామెంట్స్ చేశాడు. ఇండియా ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.. పదేళ్ల యూపీఏ గవర్నమెంట్ పూర్తిగా అవినీతిమయం.. అసమర్థ నాయకులు, అసమర్థ పాలనకు నిదర్శనం యుపీఎ పాలన అని ఆయన అన్నారు. కశ్మీర్ లో 370 ఆర్టికల్ తీసుకు వచ్చాము.. దేశంలో టెర్రరిజం యాక్టివిటీ పూర్తిగా తగ్గింది.. గతంలో హైదరాబాద్ లోని లుంబినీ పార్కు, ఢిల్లీలో టెర్రరిజం పంజా విసిరింది అని అన్నారు.
Also Read : Eggs Production: కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ వన్
ప్రపంచ దేశాల్లో భారత్ 5వ లార్జెస్ట్ ఎకానమీ సాధించిన దేశంగా నిలిచిందని ప్రహ్లాద్ జోషి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో మూడో స్థానానికి చేరుతాం.. 45 లక్షల ఇండ్లు యూపీఏ నిర్మిస్తే.. 3 కోట్ల ఇండ్లు కట్టించాము..
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి అవస్ యోజన అమలు కావడం లేదు.. నేను కేసీఆర్ ను అడుగుతున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎటు పోయింది.. 200 కోట్ల రూపాయలు పెట్టి ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ నిర్మించుకున్నారు. కానీ పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కట్టివ్వలేదు అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.
Also Read : Neha sharma : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న నేహా శర్మ..!!
జల జీవన్ మిషన్ లో భాగంగా 2019లో హార్ ఘర్ నల్ యోజన ప్రారభించగా 3 కోట్ల లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు 12 కోట్ల మందికి నల్ కనెక్షన్లు ఇచ్చాము అని తెలిపాడు. గ్యాస్ కనెక్షన్లు 8 కోట్ల లబ్ధిదారుల నుంచి 10 కోట్ల మంది లబ్ధిదారులకు పెంచాము.. 48 కోట్ల మందికి జన్ ధన్ యోజన పథకం ద్వారా లబ్ది కల్పించాము.. యూపీఎలో ఆధార్ నిరాదరంగా ఉంది.. యూపీఎ ప్రభుత్వంలో అన్ అకౌంటెడ్ మనీ అంతా కాంగ్రెస్ నేతల జేబుల్లోకి వెళ్ళేది అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వంలో 2లక్షల 4 వేల కోట్ల నల్లధనాన్ని అరికట్టాము అని జోషి తెలిపాడు.
Also Read : Sai Dharam Tej: ఈ అమ్మాయిని కాస్త చూసుకో ‘మార్క్’ బ్రో…
మోడీ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.. 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాము.. దేశంలో రోజుకు 37 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నాము.. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేస్తోంది అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఇండియా రక్షించ బడింది.. ఇప్పుడు 55 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాం.. రోజుకు 16 గంటలు మోడీ పని చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఎప్పుడు చూసిన ఫామ్ హౌజ్ లోనే గడుపుతున్నారు.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి పాలిటిక్స్ చేస్తున్నాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Indigo Airlines: ఆకాశాన్ని శాసించేందుకు సిద్ధమైన ఇండిగో ఎయిర్ లైన్స్
కేసీఆర్ అతని కుటుంబ సభ్యులు నలుగురికి ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం మరిచారు అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించాడు. కేసీఆర్ మరో నిజాం అయ్యారు.. కేసీఆర్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలం అయ్యింది.. దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్స్.. ఆహార భద్రత కార్డుల జారీ, దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వడంలో విఫలమైయ్యారు. కేసీఆర్, కేటీఆర్ పాలన చూసి మోసపోయిన ప్రజలు, దేశంలో నరేంద్ర మోడీ సంక్షేమ పాలన చూస్తున్నారు.. కాబట్టి తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వండి అంటూ ప్రహ్లాద్ జోషి కోరారు.