Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం
- “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేసిన నిర్వాహకులు
- ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ
- ఒక్కో వ్యక్తి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు
- సుమారు 90 మంది యువకులు మోసపోయినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు.
ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్‌లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. విదేశాల్లో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూసిన యువకుల్లో కొంతమందిని ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు బాధితులు వాపోయారు.
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ఇక హఫీజ్‌పేట్‌లో ఉన్న కన్సల్టెన్సీ కార్యాలయం అకస్మాత్తుగా మూతపడటంతో మోసపోయిన నిరుద్యోగులు షాక్‌కు గురయ్యారు. కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులకు తాళాలు వేసి ఉండటం కనిపించడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, అధికారిక ధృవీకరణలు ఉన్న సంస్థల ద్వారానే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!