స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ లో భాగమైపోయాయి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా స్మార్ట్ వస్తువులు ప్రవేశిస్తున్నాయి. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తాయని కంపెనీ పేర్కొంది.
Also Read:The Paradise: మోహన్ బాబు కోసం ఏడున్నర కోట్ల సెట్
ఈ స్మార్ట్ టైర్‌ను పూర్తిగా సొంతంగా అభివృద్ధి చేసినట్లు JK టైర్ తెలిపింది. ఈ టైర్లలో గాలి పీడనం, ఉష్ణోగ్రత, ఎయిర్ లీకేజీలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించే అధునాతన సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఈ డేటా డ్రైవర్‌ను రియల్ టైమ్ లో హెచ్చరిస్తుంది. రహదారి భద్రత, నిర్వహణ, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ “స్మార్ట్ టైర్లు” వాహనం స్థితిని ప్రతి క్షణం పసిగట్టి, దానిని సురక్షితంగా, మరింత సమర్థవంతంగా చేస్తాయి. ఈ సాంకేతికత టైర్ల జీవితకాలాన్ని పొడిగించడానికి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. JK టైర్ విజయం కేవలం ఒక ఉత్పత్తి ఆవిష్కరణ మాత్రమే కాదు, “ఆత్మనిర్భర్ భారత్” (మేక్ ఇన్ ఇండియా) కి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ కూడా.
ఈ స్మార్ట్ టైర్లను మొదటగా ఆఫ్టర్ మార్కెట్ కోసం విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ టైర్లు 14 అంగుళాల నుండి 17 అంగుళాల వరకు సైజుల్లో లభిస్తాయి. ఈ టైర్లను కాంపాక్ట్ కార్ల నుండి ప్రీమియం సెడాన్ల వరకు వాహనాలలో ఉపయోగించవచ్చు. వాటి ధరలకు సంబంధించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.