JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ (JioHome) వినియోగదారుల కోసం ఒక ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నూతన కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి అండ్ ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద యూజర్లు 2 నెలల ప్లాన్‌ను ఎంచుకుంటే, వారికి మరో 1 నెల సేవలని పూర్తి ఉచితంగా అందిస్తారు. అంటే వినియోగదారులు కేవలం 2 నెలల రుసుము చెల్లించి మొత్తం 3 నెలల పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ ఆఫర్ ముఖ్యంగా జియో 100 Mbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై లభిస్తుంది. ఈ ప్లాన్ నెలవారీ ధర రూ.899. ఒకేసారి 2 నెలల రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా పొందే అదనపు నెలతో కలిపి 3 నెలల పాటు అపరిమిత డేటాను అనుభవించవచ్చు. ఈ 100 Mbps వేగంతో 4K వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాలింగ్, ఆన్లైన్ క్లాసెస్ వంటి పనులను ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చు.
Also Read
ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఈ ప్లాన్ వినోద ప్రియులకు పండుగలాంటిది. ఇందులో 12 ప్రముఖ ప్రైమ్ OTT యాప్‌ల ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. JioHotstar, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Hoichoi, Chaupal, Planet Marathi, FanCode వంటి టాప్ యాప్‌లు ఇందులో భాగమై ఉన్నాయి. వీటితో పాటు 1000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను కూడా వీక్షించే సదుపాయం కలదు. ఇందులో వార్తలు, స్పోర్ట్స్, పిల్లల కార్యక్రమాలు, ప్రాంతీయ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయి.
ఒకే ప్లాన్‌లో ఇటు వైఫై, అటు ఎంటర్టైన్మెంట్ కావలాలనుకునే కుటుంబాలకు ఇది అత్యుత్తమ ఎంపిక. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు అర్హత కలిగిన 2 నెలల ప్లాన్‌ను ఎంచుకోవాలి. ప్రాంతాన్ని బట్టి, ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి నిబంధనలు మారే అవకాశం ఉన్నందున, ప్లాన్ తీసుకునే ముందు జియో అధికారిక వెబ్సైట్ లేదా MyJio యాప్ ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!