Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది.
AP FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో కొత్త ట్విస్ట్..!
ఇక డ్యూయల్ సిమ్ ఫోన్‌లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సిమ్‌లు ఉపయోగించే వాళ్లు రీచార్జ్ చేసేముందు ఒకసారి ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రెండు కంపెనీలు కూడా 28 రోజుల వాలిడిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లు అందిస్తున్నాయి. అయితే వీటిలో ఏ కంపెనీ ప్లాన్ చవక..? ఏది మంచి బెనిఫిట్స్ ఇస్తోంది..? ఇప్పుడు ఈ రెండు ప్లాన్‌ల మధ్య ప్రధాన తేడాలను చూద్దాం.
జియో రూ. 189 ప్లాన్:
జియో అందిస్తున్న రూ. 189 ల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు మొత్తం 2GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది. ఇక కాల్‌ల విషయానికి వస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాలింగ్, అలాగే మొత్తం 300 SMSలు లభిస్తాయి. ఇక అదనపు ప్రయోజనాల్లో JioTV, JioAI Cloud యాక్సెస్ కూడా ఉంటుంది. తక్కువ ధరలో సరైన బేసిక్ రీచార్జ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్:
ఎయిర్‌టెల్ అందిస్తున్న 28 రోజుల వాలిడిటీతో ఉన్న అత్యంత చవకైన ప్లాన్ ధర రూ. 199 లు. ఇది జియో ప్లాన్‌తో పోలిస్తే 10 రూపాయలు ఎక్కువ. ఈ ప్లాన్ కూడా యూజర్లకు మొత్తం 2GB హై-స్పీడ్ డాటా, అన్లిమిటెడ్ కాలింగ్, అలాగే రోజుకు 100 SMSలు అందిస్తుంది. ఇక SMS పరంగా చూస్తే.. ఈ ప్లాన్ జియో ప్లాన్ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే జియో 28 రోజులకు కేవలం 300 SMSలు మాత్రమే ఇస్తున్నప్పటికీ, ఎయిర్‌టెల్ మాత్రం ప్రతిరోజూ 100 SMSలు అందిస్తోంది.
Airtel Annual Plan: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్.. రూ. 2,249కే.. బెనిఫిట్స్ ఇవే
ఏ ప్లాన్ మంచి?
జియో ప్లాన్ లో తక్కువ ధర, JioTV & JioAI క్లౌడ్ లాంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ప్లాన్ లో SMSలు ఎక్కువ, కాలింగ్ & డేటా ప్రయోజనాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ప్లాన్ ఎంచుకోవచ్చు. ఎక్కువ SMS అవసరమైతే ఎయిర్టెల్ మంచిది. అదనపు యాప్ ప్రయోజనాలతో రీచార్జ్ చేయాలనుకుంటే జియో ప్లాన్ బెస్ట్.
