NTV Telugu Site icon

Jio OTT Plans: ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్.. OTT లవర్స్ ఓ లుక్కేయండి

Jio

Jio

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్ టైన్ మెంట్ ఇంట్లోనే సందడి చేస్తోంది. మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను, సిరీస్ లను, ఇతర వీడియో కంటెంట్ లను ఓటీటీలోనే చూస్తున్నారు. ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి. అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 12 ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. జియో అందించే ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read:Samsung Galaxy Book 5 series: క్రేజీ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి సామ్ సంగ్ కొత్త ల్యాప్ టాప్స్..

జియో రూ.445 ప్లాన్

రిలయన్స్ జియో రూ.445 ప్లాన్ పూర్తి 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 2GB రోజువారీ డేటాతో పాటు, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 100 SMS లను కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటాకు యాక్సెస్‌ను అందిస్తోంది. 4G వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 56GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు.

Also Read:Jana Nayagan : విజయ్ సినిమా కోసం రంగంలోకి ముగ్గురు దర్శకులు..?

జియో రూ.175 ప్లాన్

జియో రూ.175 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. 10GB అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీన్ని ఏదైనా యాక్టివ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అందించే సేవల జాబితాలో Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode and Hoichoi via JioTV app యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు.