Jio Financial Share: గత నెలలో దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లేదా JFSL షేర్లు సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSEలలో లిస్టింగ్ కానున్నాయి. లిస్టింగ్‌కు ముందు డిజిటల్-ఫస్ట్ NBFC షేర్లు గ్రే మార్కెట్‌లో దాదాపు రూ. 300 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది ప్రీ-లిస్టింగ్ ధర రూ. 261.85 కంటే ఎక్కువగా ఉంది. మొదటి 10 రోజులు JFSL T గ్రూప్ విభాగంలో ట్రేడ్ అవుతుంది. అంటే స్టాక్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ సాధ్యం కాదు. ఇరువైపులా 5 శాతం సర్క్యూట్ పరిమితి ఉంటుంది. దీంతో స్టాక్‌లో భారీ ర్యాలీకి అడ్డుకట్ట పడుతుందని సామ్‌కో సెక్యూరిటీస్‌కు చెందిన అపూర్వ శేత్ అన్నారు. షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకునే అవకాశం ఉన్నందున కొంత అమ్మకాల ఒత్తిడి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు.
Read Also:Mother: మృత్యుంజయురాలు.. ప్రాణాలకు తెగించి నెల రోజుల పసికందును కాపాడిన తల్లి
జూలై 20 నాడు Jio ఫైనాన్షియల్ ప్రీ-లిస్టింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 261.85కి వచ్చింది. ఇది దాదాపు రూ. 190 బ్రోకరేజ్ అంచనా కంటే ఎక్కువ. RIL కొనుగోలు ధర రూ. 133. NBFC షేర్లు గత వారం 1:1 నిష్పత్తిలో అర్హత కలిగిన RIL వాటాదారుల డీమ్యాట్ ఖాతాలలో జమ చేయబడ్డాయి. అంటే జూలై 20 రికార్డు తేదీ వరకు ఉన్న ప్రతి RIL షేర్‌కు, వాటాదారులు JFSL ఒక షేరును పొందారు. పెట్టుబడిదారులు స్వల్ప, మధ్య కాలంలో జియో ఫైనాన్షియల్ నుండి ఎటువంటి అద్భుతాలను ఆశించకూడదని అపూర్వ శేథ్ చెబుతున్నారు. కనీసం 5 సంవత్సరాల పాటు వేచి ఉండగల పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లను తమ వద్ద ఉంచుకోవాలని షెత్ చెప్పారు. JFSL ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి Linpr బ్లాక్‌రాక్‌తో 50:50 జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. బ్లాక్‌రాక్ గ్లోబల్ ఫండ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యం, జియో సాంకేతిక శక్తి, విస్తరించిన కస్టమర్ గ్రూప్‌తో కలిపి రూ. 44.3 ట్రిలియన్ ($540.4 బిలియన్) విలువైన భారతదేశ అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను పునర్నిర్మించగలదని ఇన్వాసెట్ PMS భాగస్వామి, రీసెర్చ్ హెడ్ అనిరుధ్ గార్గ్ అన్నారు.
Read Also:Asia Cup 2023: ఆసియా కప్ 2023కి ముందు నిప్పులపై నడిచిన క్రికెటర్.. ఎందుకో తెలుసా?