NTV Telugu Site icon

Telangana Governor: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. తెలంగాణ కొత్త గవర్నర్‌ ఈయనే..

Cp Radhakrishnan

Cp Radhakrishnan

Telangana Governor: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్రవేశారు.. ఇక, తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలను జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ చేతిలో పెట్టారు.. అంటే, జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌కు అప్పగించారు రాష్ట్రపతి..

Read Also: Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?

కాగా, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కాగా.. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారని చెబుతున్నారు.. బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.. సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. మొదట్లో అంతా సాఫీగా సాగినా.. ఆతర్వాత బీఆర్ఎస్ సర్కార్‌ వర్సెస్‌ గవర్నర్‌గా మారింది.. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళిసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. మరోవైపు.. బీఆర్ఎస్‌ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య చాలా విషయాలు బేధాభిప్రాయాలు వచ్చి.. రచ్చగా మారాయి.. ఇక, ఆ తర్వాత బీఆర్ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య కొంత సఖ్యత కనబడింది.. కానీ, గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు తమిళిసై.

Read Also: Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య.. కూతురుని చంపిన తల్లి..?

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన తర్వాత.. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మల్కాజ్‌గిరిలో రోడ్‌షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేశారు. అక్కడే తమిళిసైకి మోడీ లోక్‌సభ స్థానంపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేయడం.. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.. ఇక, బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో తమిళిసై పేరు రావడమే మిగిలిపోయింది.