Husband Wife Dies Same Day: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం యుగంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. కానీ.. ఇక్క మాత్రం జీవితాంతం కలిసి జీవించిన భార్యాభర్తలు మరణంలోనూ తోడుగా నిలిచారు. మొదట భార్య మరణించింది. దాదాపు 12 గంటల తర్వాత.. భర్త కూడా లోకాన్ని విడిచాడు. ఇద్దరి చితులను పక్కపక్కనే ఉంచి దహనం చేశారు. ఈ హృదయ విదారక సంఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను కంటతడి పెట్టించింది.
ఈ ఘటన ఝాన్సీ జిల్లా గరౌత పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్‌లో చోటు చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌రతన్ గుప్తా(76), రామ్‌దేవి గుప్తా(70) ఇద్దరు దంపతులు.. వీరికి అరవింద్ గుప్తా, ధమేంద్ర గుప్తా, ఉపేంద్ర గుప్తా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రతన్ గుప్తా హమీర్‌పూర్ జిల్లాలోని పరసన్ గ్రామానికి చెందివ్యక్తి. కానీ వివాహం అనంతరం.. గరౌతలో స్థిరపడ్డారు. రామ్‌రతన్, రాందేవి 50 సంవత్సరాల సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడిపారు.
READ MORE: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
కుటుంబీకుల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 4వ తేదీ శనివారం ఉదయం రాందేవి అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించింది. తన భార్య మరణ వార్త విన్న భర్త రామ్‌రతన్ ఓదార్చలేకపోయాడు. రాందేవి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగానే భర్త రామ్‌రతన్ సైతం అకస్మాత్తుగా మరణించారు. శనివారం ఉదయం 9 గంటలకు భార్య మరణించగా, భర్త రామ్‌రతన్ రాత్రి 9 గంటలకు మరణించారు. ఇద్దరి భౌతిక కాయాలకు ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇరు పాడెలను ఒకేసారి తీసుకెళ్తుండగా.. గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది.