Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం సాధించింది. పెగులా దాటి ముందు స్వైటెక్ నిలవలేకపోయింది. సెమీస్‌లో స్టార్ క్రీడాకారిణి కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్ )తో తలపడనుంది.
మరో సెమీస్‌లో ఎమ్మా నవారో (అమెరికా) రెండో సీడ్ అరియానా సబలెంక (బెలారస్)ను ఢీకొట్టనుంది. జెస్సికా పెగులాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ కావడం విశేషం. సెమీఫైనల్ మ్యాచులలో నవారో, పెగులా గెలిస్తే.. ఈసారి యూఎస్ ఓపెన్ విజేతగా అమెరికన్ క్రీడాకారిణే నిలవనుంది. గతేడాది యూఎస్ ఓపెన్‌ను కొకో గాఫ్ గెలిచిన విషయం తెలిసిందే.
Also Read: Pranitha Subhash: రెండోసారి తల్లైన హీరోయిన్ ప్రణీత.. పిక్ వైరల్!
పురుషుల సింగిల్స్‌లో టాప్ ర్యాంకర్ సినర్ (ఇటలీ) సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో మెద్వెదెవ్ (రష్యా)పై 6-2, 1-6, 6-1, 6-4తో విజయం సాధించాడు. ఇప్పటికే నోవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాస్ లాంటి స్టార్ ఆటగాళ్లను ఓడించిన సినర్.. యూఎస్ ఓపెన్ 2024లో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. సెమీస్‌లో జాక్ డ్రేపర్ (బ్రిటన్)తో సినర్ తలపడనున్నాడు.