Site icon NTV Telugu

Tirupati: భోజనం ప్లేటులో జెర్రీ ప్రత్యక్షం.. హోటల్‌పై కేసు నమోదు

Meals

Meals

Tirupati: ఎవరైనా బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్‌క్రీమ్‌లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్‌లో తినే భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది. తిరుపతిలోని లీలామహల్ సెంటర్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ప్లేట్‌లో జెర్రీ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి కంగుతిని హోటల్ సిబ్బందిని నిలదీశాడు. డబ్బులు చెల్లించి భోజనం చేసేందుకు వస్తే ఇలాంటి భోజనం పెడతారా అంటూ గట్టిగా నిలదీయగా.. కస్టమర్‌పై హోటల్ సిబ్బంది ఎదురుదాడికి ప్రయత్నించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. భోజనం నాణ్యతతో పాటు కిచెన్‌ పరిసరాలను పరిశీలించారు. కూరగాయలతో పాట వంటల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్‌పై కేసు నమోదు చేశారు.

Read Also: Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!

Exit mobile version