తెలంగాణ ఉద్యమ సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ అమరవీరుల త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్‌గా ఆవిర్భవించిందని, టీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించనోళ్లు.. బీఆర్ఎస్ తో దేశాన్ని ఉద్ధరిస్తామనడం, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ నాయకురాలు, సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం జమ్మికుంట గాంధీ చౌక్ లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు బీజేపీ నాయకురాలు, సినీనటిజీవిత రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల జమ్మికుంటలో జరిగిన బీఆర్‌ఎస్ మీటింగ్‌లో హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం నీదే అంటూ మంత్రి కేటీఆర్ కౌశిక్‌రెడ్డికి చెప్పారని, అతడు ఒక పెద్ద రౌడీ అంటూ మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి తన కుటుంబసభ్యుడితోనే పరుషంగా ప్రవర్తించాడని, ఆయన ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తి అన్నారు.
Also Read : Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్ మృతి, 9 మందికి గాయాలు
అంతేకాకుండా.. బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంధం తెగిపోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కౌండౌన్ స్టార్ట్ అయిందని, బీఆర్ఎస్ హటావో.. తెలంగాణ బచావో నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. నాడు టీఆర్ఎస్ పార్టీతెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధనలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగానే నేడు శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో ప్రజల మధ్యకు వచ్చిందన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల కాలం గడిచిపోయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చి 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ మార్చారని ఆమె దుయ్యబట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తిని వీడి అధికారమే పరమావధిగా ఇన్నేళ్ల కాలంగా జీవిస్తుందన్నారు.
Also Read : Kotamreddy vs Anil Kumar Yadav: కొట్టుకున్న కోటంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వర్గీయులు.. కత్తి పోట్లు
నీళ్లు, నిధులు , నియామకాల కోసం కొట్లాడించుకున్న తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలన చేతిలో బందీ అయిందని, తెలంగాణ సమాజం కోరుకున్న దానికంటే భిన్నంగా కేసీఆర్ సర్కార్ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందే వేదం శాసనం అనే విధంగా మారిందని, సామాన్యులు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, నాడు టీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ సాధించింది ఏమిటి? నేడు బీఆర్ఎస్ తో సాధించేది ఏమిటో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం అనేక సమస్యల తో సతమతమవుతుంటే పరిష్కరించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో ఏ రంగం కూడా సక్రమంగా అభివృద్ధి చెందింది లేదని, సామాన్య ప్రజానీకం జీవంచలేని దయనీయపరిస్థితి కేసీఆర్ పాలనలోనే ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాడు టీఆర్ఎస్ మాయ మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేశారని, నేడు బీఆర్ఎస్ తో మళ్లీ ప్రజానీకాన్ని మోసం చేయడానికి కొత్త రాజకీయ నాటకం మొదలు పెట్టారని విమర్శించారు.