JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే సర్పంచ్లతో రాజీనామా చేయిస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన ప్రయత్నమని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసే పోరాటంగా తాను భావిస్తానని పేర్కొన్నారు. కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేని వారిని నాయకులుగా ఎన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్లోని 49 మందిలో 26 మంది బీటెక్, ఎంటెక్, డాక్టరేట్ చదివిన వారే ఉన్నారని తెలిపారు. తన కౌన్సిలర్లను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే తమ సర్పంచులతో రాజీనామా చేయిస్తానని స్పష్టం చేశారు.
సర్పంచ్ అంటే ఉదయాన్నే వార్డుల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కాలువలు శుభ్రం చేయించి, పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సొంత వనరులను సృష్టించుకోవాలని అన్నారు. డబ్బు లేకపోయినా వార్డు మెంబర్ ప్రజలకు ఎంతో సేవ చేయగలరని, ప్రజాసేవకు కావాల్సింది డబ్బు కాదని.. ధైర్యం, ఆసక్తి అని పేర్కొన్నారు. దౌర్జన్యాలు చేయడం, వాహనాలు దహనం చేయడం, ఇంట్లో కూర్చుని నామినేషన్లు వేసే రోజులు పోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. యూట్యూబ్ల ద్వారా ప్రచారం చేసుకోవడం కంటే ప్రజల్లోకి వెళ్లి వారి మన్ననలు పొందాలని సూచించారు. ప్రతి వార్డుకు సంబంధించిన ఏ టు జెడ్ సమాచారంతో పుస్తకాలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్డు సమాచార పుస్తకాలను రాష్ట్రంలోని మేయర్లందరికీ పంపిస్తానని చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని, వాటిని ఉపయోగించి ప్రజలకు మంచి చేయడం మాత్రం ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి..
Also Read
- JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
- Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
- JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
- Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే సర్పంచ్లతో రాజీనామా చేయిస్తా..!
-
Ramayana Tickets: ఆడియన్స్కు బంపర్ ఆఫర్.. రూ.99కే ‘రామాయణ’ టికెట్!
-
PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
-
Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
-
Legal Notice to Sonia Gandhi: సోనియా గాంధీ పుస్తకంపై మరో వివాదం.. సావర్కర్ మునిమనవడి సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!