JC Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ.. పోలీసులకు అయ్యే భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తామని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు కదా…? అని ప్రశ్నించారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి చెల్లించాడా..? లేదా..? అని చెప్పాలని అనంత వెంకట్రామిరెడ్డిని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. చదువురాని వాళ్లు మాట్లాడితే ఒక అర్థం ఉంది.. కానీ, న్యాయవాది, రాజకీయ నాయకుడైన అనంత వెంకట్రామిరెడ్డి అన్ని తెలిసి మాట్లాడితే ఎలా..? అని నిలదీశారు.. మాకు చట్టం పైన గౌరవం ఉంది.. చట్టం ఏదో చెప్పిందో అదే పాటించాలని మేము కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
Read Also: Trump Statue: ఇదేందయ్యా ఇది.. బతికి ఉండగానే అమెరికా అధ్యక్షుడికి బంగారు విగ్రహం!
