Site icon NTV Telugu

Jayasudha : బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే జయసుధ..?

Jayasudha Bjp

Jayasudha Bjp

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. జయసుధ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై కిషన్ రెడ్డి చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2009లో పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Also Read : Viral Video: బాహుబలి కారును మీరెప్పుడైనా చూశారా.. చూస్తే అవాక్కవాల్సిందే..!

బీజేపీలో చేరేందుకు జయసుధ గతంలోనే చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి ఆమె బీజేపీ నేతలను కలిశారని సమాచారం. పార్టీ చేరికల కమిటీతో జయసుధ చర్చలు జరిపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అప్పట్లో జరిగిన చర్చల తర్వాత బీజేపీ కానీ, జయసుధ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గతంలో జరిగిన చర్చల్లో జయసుధ పార్టీలో చేరికపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జయసుధ త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయసుధ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Health Tips: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం..!

Exit mobile version