Site icon NTV Telugu

Javed Ahmed Mattoo: ఢిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌ జావేద్ అహ్మద్ మట్టూ

Javed Ahmed Mattoo

Javed Ahmed Mattoo

Javed Ahmed Mattoo: జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది. మట్టూ జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భద్రతా సంస్థల జాబితాలో లోయలోని టాప్ 10 లక్ష్యాలలో ఒకడిగా ఉన్నాడు. అతని తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

Read Also: Divya Pahuja: దివ్య పహుజా మృతదేహాన్ని తరలించిన కారు పాటియాలాలో లభ్యం

మట్టూ సోపోర్ నివాసి కాగా.. చాలాసార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడు. గత సంవత్సరం, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, సోపోర్‌లోని తన ఇంటిలో మట్టూ సోదరుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీడియో వైరల్‌గా మారింది.

Exit mobile version