Jasprit Bumrah, KL Rahul likely to play Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసియా కప్ 2023లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే బుమ్రా, రాహుల్ గాయాల పురోగతిపై బీసీసీఐ, ఎన్‌సీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆగస్ట్ 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023లో ఈ ఇద్దరూ బరిలోకి దిగితే.. ప్రపంచకప్ 2023లో కూడా ఆడనున్నారు.
2022 సెప్టెంబర్ నుంచి జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 9 నెలలు బుమ్రా ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చినా.. వాటిని ఎన్‌సీఏ ఖండించింది. బుమ్రా రోజూ ఏడేసి ఓవర్ల చొప్పున బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని పేర్కొంది. ఆసియా కప్ 2023కి మరో నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఆలోగా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఎన్‌సీఏ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
మరోవైపు ఐపీఎల్ 2023 మధ్యలో మోకాలి గాయం కారణంగా వైదొలిగిన కేఎల్ రాహుల్ కూడా ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఇపుడు ఎన్‌సీఏలో అతడు వేగంగా కోలుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను కూడా రాహుల్ ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసియా కప్ 2023 సమయానికి రాహుల్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఎన్‌సీఏ వర్గాలు భావిస్తున్నాయి.
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా ఆసియా కప్ 2023 సహా ప్రపంచకప్ 2023కి కూడా దూరం కానున్నడని సమాచారం. ఇదే జరిగితే టీమిండియాకు భారీ షాక్ తగులుతుంది. ఎందుకంటే నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ లేక భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకవేళ అయ్యర్ పూర్తిగా కోలుకోని పక్షంలో సూర్యకుమార్ యాదవ్ లేదా సంజూ శాంసన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు