ఈ మధ్య ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. థియేటర్ల లో కన్నా ఇక్కడ విడుదలైన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. అందులో డౌట్ లేదు.. స్టార్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రతివారం సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన భారీ బడ్జెట్ సినిమా జపాన్ సినిమా కూడా ఓటీటిలోకి వచ్చేస్తుంది.. ఎక్కడ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జపాన్ లో కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే ఆయన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. యావరేజ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ లు కూడా భారీగానే వసూల్ చేసిందని తెలుస్తుంది..
ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయిన రెండు భాషల్లో నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. జపాన్ ను నెట్ ఫ్లిక్స్ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంచారు.. ఇక తెలుగు వెర్షన్ ను డిసెంబర్ 13 అంటే రేపటి నుంచే అందుబాటులో ఉంచుతారని తెలుస్తుంది.. ఇక అక్కడ ఏ మాత్రం టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇక కార్తీ మరో సినిమాను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం..