Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar: ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదర్శన స్థలమైన జంతర్ మంతర్ (Jantar Mantar) ప్రాంతానికి చెందిన రోడ్డు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ పూర్తిగా తెరుచుకుంది. భద్రతా సమీక్ష అనంతరం, రాజధానిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను పూర్తిగా తొలగించాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న శాశ్వత, తాత్కాలిక నాకాబంధీలు తొలగించడంతో అశోక్ రోడ్డును (Ashoka Road) టాప్స్టాయ్ మార్గ్‌తో కలిపే ఈ ప్రధాన రహదారిలో సాధారణ వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. దీనివల్ల ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే డైలీ కమ్యూటర్లకు (Daily commuters) ఎంతో ఊరట లభించడమే కాకుండా, చుట్టూ తిరిగి వెళ్లే తిప్పలు కూడా తప్పాయి.
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) చేపట్టిన నిరసన ప్రదర్శనల అనంతరం, గత నెలలోనే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రాంతాల జాబితా నుంచి తొలగించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా భద్రతా ఏజెన్సీలు ఇక్కడ ఆంక్షలు కొనసాగించాయి. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోవడంతో, ఉన్నతాధికారులు సమీక్ష జరిపి బారికేడ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. ఇక, చారిత్రకంగా జంతర్ మంతర్ అనేక ప్రజా ఉద్యమాలకు, నిరసనలకు (Protests) కేంద్రబిందువుగా నిలిచింది. 1990ల ప్రారంభంలో, ముఖ్యంగా 1993 తర్వాత పార్లమెంటు (Parliament) సమీపంలో తమ నిరసనలు తెలిపేందుకు వచ్చే వారిని అనధికారికంగా ఈ రోడ్డు వైపే మళ్లించేవారు. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమాలు, ధర్నాలకు ఇది ప్రధాన వేదికగా మారింది. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే (Anna Hazare) చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం కూడా ఇక్కడే ప్రారంభమై, ఆ తర్వాత రామ్‌లీలా మైదానానికి (Ramlila Maidan) మారింది. అంతేకాకుండా 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ (Nirbhaya) దారుణ సంఘటన తర్వాత, న్యాయం, మహిళల భద్రత కోసం వేలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి నిరసన తెలిపింది కూడా ఈ జంతర్ మంతర్ వద్దే కావడం గమనార్హం.
Also Read
- ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
- Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
- Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
-
ECI Reforms: కొత్త ఓటర్లకు బిగ్ రిలీఫ్.. ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
-
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్..! తెరపైకి రాజకీయ నేతలు, అధికారుల లీలలు
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
ట్రెండింగ్
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!