NTV Telugu Site icon

Janhvi Kapoor: ఇదేంట్రా.. ఇంత షాక్ ఇచ్చింది!!

Janhvi Kapoor Devara

Janhvi Kapoor Devara

జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తరువాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి.. ఇక అలాంటి నటి కడుపున జన్మించిన జాన్వీ కపూర్ తాజాగా మంగళవారం తమిళంలో అనర్గళంగా మాట్లాడడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. “దేవర” ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఎన్టీఆర్‌తో కలిసి చెన్నైలో మీడియాతో సంభాషించారు. తమిళంలో మాట్లాడుతూ, చెన్నై అనగానే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది తన తల్లి అని, నగరంలో తనతో గడిపిన గొప్ప జ్ఞాపకాలన్నీ ఆమె అన్నారు. ఆమె చెన్నైని తన ఇల్లు అని అభివర్ణించింది. ఆమె చిన్న ప్రసంగానికి ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన స్పందన వచ్చింది.

Read Also: Tupperware: ఏడు దశాబ్దాల చరిత్ర గల “టప్పర్‌వేర్” కంపెనీ దివాలా..!

“దేవర”లో ఆమె తమిళ అమ్మాయి తంగం అనే పాత్రను పోషించింది. ఇక చిన్నప్పుడే జాన్వీ కపూర్ తన తల్లి దగ్గర తమిళం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది ఒకరకంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె హిందీలో మాత్రమే మాట్లాడుతుందని అనుకుంటే తమిళంలో మాట్లాడుతూ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

Read Also: Nifty IT: టీసీఎస్ నుండి విప్రో వరకు పడిపోయిన షేర్లు..

Show comments