అమ్మకాలు క్షీణించడం, పెరుగుతున్న పోటీ కారణంగా అమెరికాకు చెందిన కిచెన్‌వేర్ కంపెనీ టప్పర్‌వేర్ బ్రాండ్స్ కార్ప్ దాని అనుబంధ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న కంపెనీ.. కొత్త ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని గతంలో తెలిపిన విషయం విదితమే. దివాలా ప్రక్రియ సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతామని వివరించింది. దశాబ్దాలుగా ఆహార నిల్వ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించిన ఈ కిచెన్‌వేర్ కంపెనీ 2020 నుంచి వ్యాపారంలో కొనసాగే సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయని కంపెనీ హెచ్చరించింది. ఈ సంవత్సరం జూన్ నాటికి, దాని ఏకైక యూఎస్ ఫ్యాక్టరీని మూసివేయాలని, దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళిక వేసింది.
READ MORE: One Nation-One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కి కేంద్రం ఆమోదం..
బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ చెబుతున్న ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ కంపేనీ ఇప్పటికే భారీగా అప్పులు చేసింది. పబ్లిక్-ట్రేడెడ్ కంపెనీ అయిన టప్పర్‌వేర్, న్యాయపమరైన రక్షణ కోసం దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కంపెనీకి 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల మధ్య ఆస్తులు, 1 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల మధ్య అప్పులు ఉన్నట్లు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. కంపెనీ దివాలా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో టప్పర్‌వేర్ షేర్ల విలువ 50శాతానికి పడిపోయాయి.
READ MORE:Delhi: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
1946లో ఎర్ల్ టప్పర్ ఈ కంపెనీని స్థాపించారు. కంటైనర్ల ఫ్లెక్సిబుల్ ఎయిర్ టైట్ సీల్‌పై ఆయన పేటెంట్ పొందారు. 1950లలో యుద్ధానంతర తరానికి చెందిన మహిళలు ఆహార నిల్వ కంటైనర్‌లను విక్రయించేందుకు తమ ఇళ్లలో ట్యాప్‌వేర్ పార్టీలను నిర్వహించడంతో దీని ప్రజాదరణ వేగంగా పెరిగింది. తర్వాత చాలాకాలం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించింది. కానీ ప్రస్తుతం.. మార్కెట్‌లో చౌక ఉత్పత్తుల నుంచి టప్పర్‌వేర్ చాలాకాలంగా పోటీ ఎదుర్కొంటోంది. తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్‌వేర్ చాలా కాలంగా కష్టపడుతోంది. పెరుగుతున్న ముడిసరకుల ధరలు, అధిక వేతనాలు, రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడించింది.