Site icon NTV Telugu

Janhvi Kapoor: అయ్య బాబోయ్.. పాపకి అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటా..

Janvi Kapoor

Janvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ, దివంగత అందాల రాశి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన పెళ్లి ఎలా చేసుకోవాలని అనుకుంటుందో చెప్పింది. అయితే, దడక్‌ మూవీతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంది. కాగా, ఈమె నటన కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్నట్లుంది. తరచూ గ్లామరస్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.

Read Also: Sayaji Shinde: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఎవరు ఆందోళన పడకండి..

అయితే, ఈ 27 ఏళ్ల బ్యూటీ షికర్‌ బషీర్‌తో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతుంది. వీరి ప్రేమకు జాన్వీకపూర్‌ తండ్రి, నిర్మాత బోనీకపూర్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయనే స్వయంగా ఇటీవల వాళ్లు ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇకపోతే, ఇటీవల జాన్వీ కపూర్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాగా, ప్రతి ఏడాది నూతన సంవత్సరం, పుట్టిన రోజు లాంటి విశేష రోజుల్లో తప్పకుండా తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుటుంది. వీరిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె ఇటీవల ఒక భేటీలో తన పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి ? అనే విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి సమయంలో ఎక్కువ జన సందోహం ఉండకూడదట.. పెళ్లిలో అందరు తననే చూస్తుంటడంతో సిగ్గు వేస్తుందని చెప్పుకొచ్చింది.. అందుకే కొద్ది మందినే నా పెళ్లికి పిలుస్తాను అని పేర్కొనింది.

Read Also: MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

అలాగే తన వివాహం తమిళ సంప్రదాయం ప్రకారం జరగాలని జాన్వీ కపూర్ చెప్పింది. ఇక, వివాహానికి కాంచీపురం పట్టు చీర ధరించి, తలనిండా మల్లెపూలు పెట్టుకోవడంతో పాటు తన భర్త కూడా పంచె కట్టుకోవాలని చెప్పుకొచ్చింది. చివరిగా పెళ్లికి వచ్చిన అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలని జాన్వీ పాప తెలిపింది. మొత్తం మీద తమిళ సంప్రదాయం అక్కడ కనిపించాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ దక్షిణాది చిత్రపరిశ్రమపై నజర్ పెట్టింది. ఇప్పటికే తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్‌కు జోడిగా నటించేందుకు రెడీ అవుతుంది.

Exit mobile version