‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగు వారికి పరిచయం అయిన అవికా గోర్ ఏ క్షణంలోనైనా అందాల పెళ్లికూతుర్ని అయిపోటానికి సిద్ధం అంటోంది. కారణం ఆమెకు మన హైద్రాబాద్ లో దొరికిన ప్రియ మన్మథుడే! అఫ్ కోర్స్, అవికా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీ హైద్రాబాదీ ఏం కాదు. కానీ, వారిద్దరూ ఇక్కడే కలుసుకున్నారట! మిలింద్ ని చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. తరువాతి కాలంలో ముందుగా తానే ప్రేమ సంగతి ప్రియుడితో చెప్పిందట కూడా!…