గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు.
Also Read : Coolie : ‘చికిటు’ లిరికల్ సాంగ్.. యావరేజ్ రెస్పాన్స్
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే టాకీ పోర్షన్ సీన్స్ కూడా చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ జూలై 12న పెద్ధి షూటింగ్‌లో తిరిగి జాయిన్ కానుంది. ఆ సమయంలో జాన్వీపై కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు మరియు రెండు పాటలను షూట్ చేయబోతున్నారు. ఇంకా దాదాపు 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. హైదరాబాద్ లో షూటింగ్ ముగించి ఈ నెలాఖరు నుంచి డిల్లీలో షూటింగ్ చేసేందుకు షెడ్యుల్ ప్లాన్ చేసారు. దాదాపు ఓ ఒక వారం పాటు అక్కడ కీలక సీన్స్ తీయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆర్సీ 16కి సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది 2026 మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
