Jangaon RTC Bus Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి వైద్య బృందాలు. హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: SSMB 29 : ‘వారణాసి’ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ పట్ల మహేశ్ ఫ్యాన్స్ హ్యాపియేనా.?