Site icon NTV Telugu

Janga Krishna Murthy: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?

Janga Krishna Murthy

Janga Krishna Murthy

Janga Krishna Murthy Likely To Join TDP: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Kesineni Nani: పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా: కేశినేని నాని

ఇప్పటికే పల్నాడులోని టీడీపీ కీలక నాయకులతో జంగా కృష్ణమూర్తి భేటీ అయ్యారట. ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఏపీలో జంపింగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. అభ్యర్థుల జాబితాలు వెలువడినప్పటి నుంచి.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ దక్కనివారు రాజీనామా చేసి.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

 

Exit mobile version