Site icon NTV Telugu

Telangana Assembly Elections 2023: 8 స్థానాల్లో బరిలోకి జనసేన.. అభ్యర్థులు వీరే

Janasena

Janasena

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలచే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.. అయితే, ఈ రోజు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జనసేన పార్టీ.. తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమది స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఖరారు చేశారంటూ.. ఆ జాబితాను విడుదల చేశారు..

Read Also: Anil Kumar Yadav: జైలుకు వెళ్తే సింపతీ అంటున్నారు.. సింపతీ లేదు తొక్క, తోటకూర లేదు..!

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది.. అయితే, అనూహ్యంగా ఏపీలో టీడీపీకి మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కానీ, మాతో కలిసి వచ్చే నిర్ణయం బీజేపీదే అన్నారు. అలా ఏపీలో పొత్తుల వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి.. ఇక, ఈ రోజు ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు పవన్‌ కల్యాణ్‌.. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు అనేది తేలాల్సి ఉంది.

ఇక, జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు.. అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిస్తే..
1. కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌
2. తాండూరు – నేమూరి శంకర్‌ గౌడ్‌
3. కోదాడ – మేకల సతీష్‌రెడ్డి
4. నాగర్‌కర్నూలు – వంగ లక్ష్మణ్‌ గౌడ్‌
5. ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
6. కొత్తగూడెం – లక్కినేని సురేందర్‌ రావు
7. వైరా – డాక్టర్‌ తేజువత్‌ సంపత్‌ నాయక్‌
8. అశ్వారావుపేట – ముయబోయిన ఉమాదేవి

Exit mobile version