Telangana Assembly Elections 2023: 8 స్థానాల్లో బరిలోకి జనసేన.. అభ్యర్థులు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలచే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.. అయితే, ఈ రోజు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జనసేన పార్టీ.. తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమది స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఖరారు చేశారంటూ.. ఆ జాబితాను విడుదల చేశారు..
Read Also: Anil Kumar Yadav: జైలుకు వెళ్తే సింపతీ అంటున్నారు.. సింపతీ లేదు తొక్క, తోటకూర లేదు..!
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది.. అయితే, అనూహ్యంగా ఏపీలో టీడీపీకి మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కానీ, మాతో కలిసి వచ్చే నిర్ణయం బీజేపీదే అన్నారు. అలా ఏపీలో పొత్తుల వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి.. ఇక, ఈ రోజు ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు పవన్ కల్యాణ్.. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు అనేది తేలాల్సి ఉంది.
ఇక, జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాలు.. అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిస్తే..
1. కూకట్పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
2. తాండూరు – నేమూరి శంకర్ గౌడ్
3. కోదాడ – మేకల సతీష్‌రెడ్డి
4. నాగర్‌కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్
5. ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
6. కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు
7. వైరా – డాక్టర్ తేజువత్ సంపత్ నాయక్
8. అశ్వారావుపేట – ముయబోయిన ఉమాదేవి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా#TelanganaElection2023 pic.twitter.com/hFXrubYMEC
— JanaSena Party (@JanaSenaParty) November 7, 2023
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!