Site icon NTV Telugu

Pawan Kalyan: తెలంగాణ ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ఫోకస్.

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ జనసేన నేతలకు.. కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం చేశారు.. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన పవన్… మరి కొన్ని నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు జరపనున్నట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గాల నేతల భేటీలో తెలంగాణ జనసేన ఇంఛార్జ్‌ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యలపై దృష్టి సారించాలన్నారు.. సార్వత్రిక సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.. తెలంగాణాలో జనసేన పార్టీ ఉనికిని చాటాలి. సమస్య తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో స్పందించాలి..? ఏ స్థాయిలో పోరాటం చేయాలనే దిశగా అధ్యయనం చేయాలన్నారు..

Read Also: IPL 2023 : అక్షర్ పటేల్ దెబ్బ.. పెవిలియన్ కు సూర్యకుమార్ యాదవ్

ఇక, ప్రతి సమస్యను జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు పవన్‌ కల్యాణ్.. పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించిన ఆయన.. ప్రతి అంశంలో వీర మహిళలను, జన సైనికులను కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన మిగిలిన నియోజకవర్గాల నేతలతో కూడా సమావేశం అవుతామని ఈ సందర్భంగా వెల్లడించారు పవన్‌ కల్యాణ్‌. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి సత్తా చాటాలని ప్లాన్‌ చేస్తోంది జనసేన పార్టీ.. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా.. ఎన్నికల నాటికి టీడీపీకి కలుపుకొని పోయేవిధంగా పావులు కదుపుతోంది.. ఇక, ఈ మధ్యే ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ పెద్దలతో సమావేశం నిర్వహించిన విషయం విదితమే.

Exit mobile version