Site icon NTV Telugu

Purandeswari: పురందేశ్వరితో నాదెండ్ల మనోహర్ భేటీ.. అందుకేనా?

Janasena Bjp

Janasena Bjp

Purandeswari: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురందేశ్వరి – నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య కొనసాగుతున్నట్లు ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read Also: AP BJP: పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ

ఈ క్రమంలో ఈ భేటీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. జనసేన మా మిత్ర పక్షమేనని, నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే అని ఆమె స్పష్టం చేశారు. శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారని ఆమె వెల్లడించారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు అని.. మా‌ పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తామని ఆమె అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదేనని ఆమె వెల్లడించారు.

Exit mobile version