Nagababu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారన్నారు. హైదరాబాదులో ఉన్న నా ఓటును రద్దు చేసుకున్నానని తెలిపిన నాగబాబు.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు.
Read Also: Janasena: రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మళ్లీ వేస్తారా?
తాను నెల్లూరునే చదువుకున్నానన్న నాగబాబు.. జనసేన ఆవిర్భావం తర్వాత పలుమార్లు నెల్లూరుకు వచ్చానన్నారు. రాజకీయ పదవుల మీద ఆసక్తి, కోరిక, ఆలోచన లేదన్నారు. కేవలం జనసేన కార్యకర్తలలో స్ఫూర్తిని నింపేందుకే పనిచేస్తున్నామన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు సంబంధించి ఒక కామెడీ మ్యాగజైన్ ఉందని.. అందులో తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాశారని.. ఓటును మార్చుకుందామని భావించానన్నారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందజేశామన్నారు. అది పరిశీలనలో ఉందన్నారు.
Read Also: Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని నాగబాబు వెల్లడించారు. ఏ నియోజకవర్గమనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారన్నారు. మా అమ్మది నెల్లూరు.. నెల్లూరుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నానని నాగబాబు స్పష్టం చేశారు.