NTV Telugu Site icon

Nadendla Manohar: పథకాలు నిజాయితీగా ప్రజలకు అందాలనేదే మా పోరాటం

Nadendla

Nadendla

Nadendla Manohar: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకాలు నిజాయితీగా నేరుగా అంతిమంగా ప్రజలకు అందాలనేదే తమ పోరాటమని తెలిపారు. పాలవెల్లువ పథకం పాపాల వెల్లువ అని.. పాలవెల్లువ పథకంలో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఈన్ని రోజులు పట్టిందా అంటూ ఆయన ప్రశ్నించారు. కోట్లు పెట్టి పథకాలు తెచ్చినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నాదెండ్ల ప్రశ్నించారు.

పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారని ఆయన ఆరోపించారు. పథకంలో వేల కోట్లు అవినీతి జరిగింది.. ఆ డబ్బులు అన్ని ఎటుపోయాయో సమాధానం చెప్పాలన్నారు. మీ శాఖ మీద జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాలన్నారు. ఈ మంత్రి మీదే మరో అంబులెన్స్ స్కాం బయట పెడతామని దానికి కూడా సిద్దంగా ఉండాలన్నారు. మీ శాఖ ద్వారా ప్రభుత్వం డబ్బులు నష్టం జరుగుతుంటే మీకు బాధ లేదా అంటూ వ్యాఖ్యానించారు. మేము సిద్దంగా ఉన్నామన్న ఆయన.. మండల, గ్రామాల, ద్వారా లిస్ట్ ఇవ్వండి.. ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్దామని, మా జనసేన శ్రేణులు కూడా వస్తారు మీలో నిజాయితీ ఉంటే రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వం చేస్తున్న స్కాంలను ఆధారాలతో సహా బయటపెడతామని.. వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు.

Also Read: Liquor on Road: మద్యం లారీ బోల్తా.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ మందుబాబులు

పశువుల కొనుగోలు విషయంలో ఒక మంత్రి 2,08,790 పశువులు కొనుగోలు చేసామని చెప్తే, మరో మంత్రి 3, 94,000 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సాక్షాత్తు శాసనసభలో 3,92, 911 పశువులు కొనుగోలు చేయడం జరిగిందని మరో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. క్లాస్ వార్ అని ప్రగల్బాలు పలికే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి స్కామ్ గురించి ఎండగడుతూ స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేయడమే జనసేన లక్ష్యమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాడి పరిశ్రమ పట్ల మంత్రులు తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అధికారులు చెప్పిన లెక్కలకు మంత్రులు చెప్పే లెక్కలకు పొంతన లేదన్నారు. పాడి పరిశ్రమ ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నామని, ప్రగల్బాలు పలికే రాష్ట్ర ప్రభుత్వం వారిని నమ్మించి మోసం చేశారన్నారు. అమూల్‌కి 22 లక్షల లీటర్లు అందిస్తామని గతంలో ఒక మంత్రి చెబితే నేడు మరో మంత్రి అమూల్ కోసం రెండు లక్షల 75 వేల పాల సేకరణ జరుగుతుందని చెప్పడం విడ్డూరమన్నారు.

Also Read: Mangalavaaram : షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన అజయ్ భూపతి…

శాఖలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడకుండా మరో విషయం గురించి మాట్లాడుతూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నాలుగేళ్లలో గుజరాత్ హర్యానా నుండి పశువులు కొనుగోలుకి అనుమతులు ఇచ్చిన 50,000 దాటని పరిస్థితి ఉందని ఆయనఅన్నారు. క్షేత్రస్థాయిలో పశువులు 8000 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్తుంటే వాటి పట్ల మంత్రులు సమాధానం ఇవ్వాలన్నారు. నవంబర్ 14 నుండి ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి స్కాం గురించి జనసేన బయటపెట్టడం ఖాయమని దానికి సిద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు.