Site icon NTV Telugu

JanaSena: పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..!

Janasena

Janasena

జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుంచి పి. హరిప్రసాద్ పేరుతో విడుదలైంది.

READ MORE: NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

“జనసేన పాలసీపైనా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలలో ఎప్పటి కప్పుడు తెలియజేస్తునే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీలైన్‌ను విస్మరించి మాట్లాడుతూన్నారు. ఆ మాటలు ఇటు ప్రజలలోను, అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారు కఠిన చర్యలకు గురి కావలి ఉంటుందని తెలియజేస్తున్నాం.” అని జనసేన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

READ MORE: Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ

Exit mobile version