Janasena Chief Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది అంటు నినాదంతో కదం తొక్కారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కలిసి తన సత్తా చాటారు. ఎవరూ ఊహించనంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం కచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది అనేది ఎవరూ కాదనలేని నిజం. అసలు మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. ఇటు చంద్రబాబు, అటు బీజేపీ పెద్దలు మొదట పొత్తులకు సిద్ధం కాలేదు. కానీ జనసేనాని మాత్రం పొత్తులో అన్నీ తానై వ్యవహరించి బీజేపీ పెద్దలను ఒప్పించడానికి ఆష్టకష్టాలు పడ్డారు. దీనికోసం టీడీపీ తనకు ఇచ్చిన 24 సీట్లలో మూడింటిని బీజేపీ కోసం ఆయన త్యాగం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే , 2ఎంపీ సీట్లతో పోటీ చేసిన జనసేన వందశాతం విక్టరీతో సంచలనం సృష్టించారు. ఇక పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 70 వేల మెజారిటీతో గెలుపొందిన పవన్ కల్యాణ్. చివరకి ఏపీ పాలిటిక్స్ లో తాను ఒక మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గ నిలిచాడు.