Pawan Kalyan: ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు.. వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. పవన్ కల్యాణ్‌తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశం అయ్యారు.. గూడూరు వైసీపీ టికెట్‌ను మేరిగ మురళికి కేటాయించింది.. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న వరప్రసాద్.. జనసేనానితో టచ్‌లోకి వెళ్లారు.. ఈ రోజు పవన్‌తో భేటీ అయ్యి.. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించారు.. అయితే, తిరుపతి ఎంపీ స్థానాన్ని వర ప్రసాద్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనాని ఏ స్థానం కేటాయిస్తారు అనేది తెలయాల్సి ఉంది.
Read Also: Sunil Bansal : ఈ నెల 31లోపు వాల్ రైటింగ్స్ పూర్తీ చేయాలని ఆదేశం
మరోవైపు.. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. మరోసారి పవన్‌తో భేటీ అయ్యారు.. ఇప్పటికే జనసేన పార్టీలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. అనకాపల్లి లోక్ సభ నుంచి జనసేన టికెట్‌ను ఆశిస్తున్నారాయన.. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకున్నా.. పూర్తిస్థాయిలో పనిచేస్తానని.. ఏ స్థానం కేటాయిస్తారు అనేది పార్టీ అధినేత ఇష్టమని ప్రకటించారు కొణతాల.. ఇక, ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లు పూర్తి చేశారు పవన్.. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై ఆయన ఫోకస్ పెట్టారు.. ఈరోజు ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్.. ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ కూడా జనసేన గూటికి చేరారు.. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై నటుడు పృధ్వీ, డ్యాన్స్ మాస్టర్ జానీతో పవన్ చర్చలు జరిపారు.. మొత్తంగా వరుస కార్యక్రమాలతో పవన్ కల్యాణ్ బిజీగా గడుపుతున్నారు.
