NTV Telugu Site icon

Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..

Nagababu

Nagababu

Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. తిరుపతిలో‌ భారీ మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థి గెలవగెలవబోతుందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి తిరుపతి వచ్చిన ఆయన.. అసంతృప్త నేతలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి.. అంతా కలిసి కట్టుగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఈ రోజు నాగబాబు మాట్లాడుతూ.. కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు.. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి.. అందుకే పవన్ కల్యాణ్‌ తిరుపతి వచ్చారని తెలిపారు.. కూటమి నేతలతో మాట్లాడాం. అన్నీ సర్థుకున్నాయి.. తిరుపతి లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. ‌

Read Also: Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్

కాగా, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై జనసేన ఇంఛార్జ్‌ కిరణ్‌ రాయల్‌, జనసేన నేతలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు దిగారు.. బహిరంగంగా పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ, జనసేన అధిష్టానం నుంచి వారిని సముదాయించే ప్రయత్నాలు జరిగాయి.. దీంతో, కొంత సైలెంట్‌ అయినా.. వారిలో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.. అయితే, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో అంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు. శుక్రవారం రోజు తిరుపతి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అర్ధరాత్రి వరుకు తిరుపతిలో కూటమీ పార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలని పిలుపునిచ్చిన ఆయన.. జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ ఒక్క నాయకుడు.. కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే.. నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాం అనే పార్టీ నేతలకు భరోసా కల్పించారు పవన్‌ కల్యాణ్‌. ఇక, ఆరణి శ్రీనివాసులు గెలుపుకోసం అంతా కృషి చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే.