NTV Telugu Site icon

Jana Reddy: ప్రభుత్వంలో నా పాత్ర ఏం ఉండదు.. కావాలంటే సలహాలు- సూచనలు ఇస్తాను..

Janareddy

Janareddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యులు కుందురు జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. కొత్త సర్కార్ కు సహకరించండి అని రేవంత్ వచ్చి కోరారు.. సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ప్రజా అభిమానం చూరగొనేలా పని చేయాలని చెప్పాను.. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు అని జానారెడ్డి వెళ్లడించారు. కానీ నా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తాను.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్ లో ఉండడం చాలా బాధాకరం.. నేను వెళ్లి కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన నిద్రలో ఉన్నారు అని జానారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Mangalagiri: వైసీపీకి వరుస షాక్‌లు..! మంగళగిరిలో కొనసాగుతున్న రాజీనామాలు..

కేటీఆర్, హరీశ్ రావు లను కలిశాను అని మాజీ మంత్రి జానారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి.. నేను పార్లమెంట్ కు పోటీ చేస్తాను అని గతంలో చెప్పాను.. అధిష్టానం ఆదేశిస్తే ఆలోచిస్తాను.. నేను అన్ని రకాల మంత్రి శాఖలను చూస్తాను అంటూ ఆయన తెలిపారు. అయితే, వచ్చే మంత్రి వర్గ విస్తరణలో జానాగారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి మరి కలిశాడు అని ప్రచారం జరుగుతుంది.