Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధినేత విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్‘. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి అడుగుపెట్టాల్సిన ఈ సినిమా రాజకీయపరమైన సన్నివేశాలు మరియు కొన్ని సున్నితమైన అంశాల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దాంతో అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించిన మేకర్స్ సెన్సార్ కు పంపారు. తాజాగా రివైజింగ్ కమిటీ సినిమాను తిరిగి వీక్షించడంతో ఈ రోజు లేదా రేపటిలోగా సర్టిఫికెట్ చేతికి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. బోర్డు సూచించిన మార్పుల తర్వాత ‘UA’ సర్టిఫికెట్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సెన్సార్ అడ్డంకులు తొలగిపోతే సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మే 7న లేదా మే 14న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే రెండో వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ కృతనిశ్చయంతో ఉంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసిన చివరి సినిమా కావడంతో దీనిపై రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సెన్సార్ క్లియరెన్స్ లభించిన వెంటనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి సమ్మర్ కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని దళపతి అభిమానులు ఆశిస్తున్నారు. సెన్సార్ ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. సెన్సార్ బోర్డు (CBFC) అధికారులు ఈ చిత్రాన్ని మరోసారి క్షుణ్ణంగా సమీక్షించిన నేపథ్యంలో నేడు సెన్సార్ సర్టిఫికెట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుండడంతో విజయ్ ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
తాజావార్తలు
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!