Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jananayagan Leak: తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘జననాయగన్’ సినిమా పైరసీ కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసారు. సినిమా ఆన్‌లైన్ లీక్‌కు సంబంధించి నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!
Also Read
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతను మరో సినిమా ఎడిటింగ్ పనుల కోసం స్టూడియోకు వెళ్లిన సమయంలో.. అక్కడ ఉన్న ‘జననాయగన్’ సినిమా రీల్స్‌ను అనధికారికంగా యాక్సెస్ చేసి చోరీ చేశాడు. అలా దొంగిలించిన డేటాను పూర్తి స్థాయి సినిమాగా మార్చి, తన సహచరులకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్లే సినిమా ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యిందని అధికారులు నిర్ధారించారు.
ఈ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా ఈ ముగ్గురు కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన వేగవంతమైన దర్యాప్తుకు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.
TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
ఈ ఘటన సందర్బంగా ప్రజలకు సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలను జారీ చేసింది. ఇందులో పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ.. పైరసీ లింకులను ఫార్వార్డ్ చేసినా లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఎక్కడైనా పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింకులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఇందుకోసం నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి తెలపవచ్చని సైబర్ క్రైమ్ టీం తెలిపింది.
తాజావార్తలు
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!