Site icon NTV Telugu

Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!

Jananayagan

Jananayagan

Jananayagan Leak: తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘జననాయగన్’ సినిమా పైరసీ కేసులో స్టేట్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసారు. సినిమా ఆన్‌లైన్ లీక్‌కు సంబంధించి నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.

Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతను మరో సినిమా ఎడిటింగ్ పనుల కోసం స్టూడియోకు వెళ్లిన సమయంలో.. అక్కడ ఉన్న ‘జననాయగన్’ సినిమా రీల్స్‌ను అనధికారికంగా యాక్సెస్ చేసి చోరీ చేశాడు. అలా దొంగిలించిన డేటాను పూర్తి స్థాయి సినిమాగా మార్చి, తన సహచరులకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్లే సినిమా ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యిందని అధికారులు నిర్ధారించారు.

ఈ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా ఈ ముగ్గురు కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం, నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన వేగవంతమైన దర్యాప్తుకు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.

TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

ఈ ఘటన సందర్బంగా ప్రజలకు సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలను జారీ చేసింది. ఇందులో పైరసీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం, స్ట్రీమ్ చేయడం లేదా ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ.. పైరసీ లింకులను ఫార్వార్డ్ చేసినా లేదా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా కఠినమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఎక్కడైనా పైరసీ కంటెంట్ లేదా అనుమానాస్పద లింకులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఇందుకోసం నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి తెలపవచ్చని సైబర్ క్రైమ్ టీం తెలిపింది.

Exit mobile version