Site icon NTV Telugu

Janasena : పుంగనూరులో ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ.. హాజరుకానున్న నాగబాబు

Janasena

Janasena

రేపు తిరుపతిలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించనున్నారు. మంగళంపేట అటవీశాఖ భూ అక్రమాలు విచారణలో సమయంలో నాగబాబు పర్యటన ఆసక్తి రేపుతోంది. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన పుంగనూరు నియోజక వర్గంలో ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. “జనంలోకి జనసేన సభ” పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి నాగబాబు హాజరవుతారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు, జనసేన నాయకులు హరిప్రసాద్, కిరణ్ రాయల్ సహా ఇతర జిల్లా నేతలు కూడా హాజరవుతారు.

READ MORE: China: అక్వేరియంలో రష్యన్ మత్స్యకన్య ప్రదర్శన.. అమాంతంగా చేప దాడి.. వీడియో వైరల్

“జనంలోకి జనసేన” కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు రానున్నారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా నాయకులు, పుంగనూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారు.” అని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పేరిట విడుదలైన లేఖలో పేర్కొన్నారు.

READ MORE: Atchannaidu: అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో…

Exit mobile version