NTV Telugu Site icon

Jana Sena: జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం.. ఇంటింటికీ వెళ్లి….

Janasena

Janasena

పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ కంట్రోల్ రూమ్ లో ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఆడపడుచులను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించనున్నారు.

READ MORE: CM Revanth Reddy: బీఆర్ఎస్‌కి పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ.. కానీ పార్టీ ఏం చేసింది?

ఈ మేరకు చొరవ తీసుకోవాలని పార్టీ వీరమహిళ విభాగానికి మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వి, పార్టీ నాయకురాలు శ్రీమతి రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

READ MORE: IFFCO: జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. కాంపిటిషన్ తక్కువ