Site icon NTV Telugu

Janasena Party: నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం..

Janasena

Janasena

Janasena Party: నేటి నుంచి జనసేన మూడో విడుత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. MEMBERSHIP TO LEADERSHIP నినాదంతో సభ్యత్వ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. గత ఐదు రోజులుగా పిఠాపురంలో విజయవంతంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల విస్తరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను జనసేన టార్గెట్ చేసింది.

Read Also: India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు!

అయితే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకుని జనసేన సభ్యత్వ డ్రైవ్ నిర్వహిస్తుంది. క్రియాశీలక సభ్యత్వ రుసుము 500 నుంచి 400కు తగ్గించింది. సభ్యత్వ రుసుమును కార్యకర్తల సంక్షేమం, ఇన్సూరెన్స్ కోసం వినియోగించేలా ప్లాన్ చేస్తుంది. సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తుంది. శాశ్వత వైకల్యం కలిగితే 2 లక్షల భీమా, ప్రమాదానికి గురైతే రూ. 50 వేల భీమా సాయం అందించేలా జనసేన ముందుకు సాగుతుంది.

Read Also: T20 World Cup: సెమీస్ రేస్‌లో ట్విస్ట్.. పాకిస్థాన్‌ ఆశలు చెరిపేసిన న్యూజిలాండ్..

ఇక, సభ్యత్వాన్ని మూడు వర్గాలుగా జనసేన పార్టీ విభజించింది. ఉద్యమి, సాధక్, ప్రదాతగా సభ్యుల వర్గీకరణ చేసింది. పార్టీ సిద్ధాంతాల ప్రచారం, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడుతల్లో 13 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసింది. పార్టీ బలోపేతంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

Exit mobile version