Jana Sena Formation Day 2026: మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల స్థాయిలో జనసేన శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ పతాక ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలను చేపట్టాలని జనసేన అధినేత సూచించారు.
Also Read: Rurban Panchayats: గ్రామపంచాయతీల పునర్ వ్యవస్థీకరణ.. కొత్తగా రూర్బన్ పంచాయతీలు!
మొదట పిఠాపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేడుకల నిర్వహణ విధానంలో మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం బదులుగా.. జిల్లా, నగర, మండల కేంద్రాల్లోనే స్థానికంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఉద్యమి సభ్యత్వం పొందిన వారితో కలిసి వేడుకలు నిర్వహణ ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను పవన్ ప్రజలకు వివరించనున్నారు.
