NTV Telugu Site icon

Jana Reddy : మాయ మాటలు, ఎలక్షన్ టైంలో డబ్బుల మూటలతో వొచ్చి గెలుస్తున్నడు కేసీఆర్

Jana Reddy

Jana Reddy

నల్గొండ హలియ మున్సిపాలిటీ అనుముల గ్రామంలో హాత్ సే హాత్ జొడో యాత్రలో మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది నేను… కేంద్రంలో మోదీ తెలంగాణాలో కేసీఆర్‌ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. మాయ మాటలు, ఎలక్షన్ టైంలో డబ్బుల మూటల సంచులతో వొచ్చి గెలుస్తున్నడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. దళితుల మూడెకరాల భూమి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగు భృతి రైతు రుణమాఫీ ఏమైందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలు మోసాలను ప్రజలకు వివరించేందుకు ఈ యాత్ర ఉద్దేశమని ఆయన వివరించారు. అధికారం లేకున్నా మీకు అండగా తోడుగా నిలుస్తున్నానని, అనుముల గ్రామంలో ప్రజాశక్తితో నేను చెక్ డ్యాం నిర్మిస్తానన్నారు. అనుముల గ్రామ ప్రజల దీవెనతో రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం నాకు దక్కిందని జానా రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : Raquel Welch: రాలిన అందం… రాక్వెల్ వెల్చ్!

ఇదిలా ఉంటే.. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని అయినవోలు మండల కేంద్రం నుండి నేడు రేవంత్‌ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభమైంది. అయినవోలు మల్లన్నను దర్శించుకున్న అనంతరం మండల కేంద్రంలోని నంది విగ్రహం నుండి పాదయాత్రను రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అయినవోలు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మీదుగా పాదయాత్ర జరుగుతుండగా… మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ని గెలిపిస్తే 500 రూపాయలకు సిలిండర్, 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి నాయకుడు అన్నీ చేస్తామని చెప్తున్నారని, ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మమ్ముల్ని మర్చిపోతున్నారని, ఎందుకు ఓట్లేయాలని ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఇళ్లులేక నానా అవస్థలుపడుతున్నామని, డబుల్‌ బెడ్‌ ఇస్తామని ఇప్పటివరకు దిక్కులేవని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read : Kanna vs GVL: కన్నా ఆరోపణలు.. జీవీఎల్‌ కౌంటర్‌