Raquel Welch: రాలిన అందం… రాక్వెల్ వెల్చ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raquel Welch Passes Away: హాలీవుడ్ అందాల తారల్లో తనదైన బాణీ పలికించిన రాక్వెల్ వెల్చ్ ఇకలేరన్న వార్త ఆమె అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. మొన్నటి దాకా ఎంతో చలాకీగా తిరిగిన రాక్వెల్ వెల్చ్ ఫిబ్రవరి 15న తన 82వ యేట తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు డామన్ వెల్చ్, కూతురు తాహ్నీ వెల్చ్ ఉన్నారు. రాక్వెల్ మరణవార్త వినగానే హాలీవుడ్ లోని ఆమె అభిమానులు, సన్నిహితులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ చికాగోలో 1940 సెప్టెంబర్ 5న రాక్వెల్ వెల్చ్ జన్మించారు. ఆమె అసలు పేరు జో రాక్వెల్ టెజేడా. రాక్వెల్ రెండేళ్ళ పాపగా ఉన్నప్పుడు వారి కుటుంబం కాలిఫోర్నియాలోని శాన్ డీగోకు మకాం మార్చారు. జోల్లా హై స్కూల్ లో చదువుతున్న రోజుల్లో ‘ఫెయిరెస్ట్ ఆఫ్ ద ఫెయిర్’ గా పేరు సంపాదించింది రాక్వెల్. 1958లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాక్వెల్, అదే యేడాది స్టేట్ కాలేజ్ లో థియేటర్ ఆర్ట్స్ లో చేరింది. 1959లో తన స్కూల్ ‘స్వీట్ హార్ట్’ జేమ్స్ వేల్చ్ ను పెళ్ళాడింది. పెళ్ళయ్యాక నటిగా అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేసింది. లభించిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకున్నారామె. 1966లో తెరకెక్కిన “ఫెంటాస్టిక్ వొయేజ్’తో రాక్వెల్ కు మంచి గుర్తింపు లభించింది. ఆపై ఆమె నటించిన “సెక్స్ క్వార్టెట్, ఒన్ మిలియన్ ఇయర్స్ బి.సి., బిడేజిల్డ్” చిత్రాలతో సెక్స్ బాంబ్ గా పేరు సంపాదించారు రాక్వెల్. 1973లో ‘ద త్రీ మస్కిటీర్స్’లో రాక్వెల్ నటనకు ఉత్తమనటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఆ తరువాత సెక్స్ సింబల్ గా తనదైన బాణీ పలికిస్తూ రాక్వెల్ వెల్చ్ సాగారు. 2017లో ఆమె చివరి సారిగా ‘హౌ టు బి ఏ లాటిన్ లవర్’ చిత్రంలో కనిపించారు. నాటి మేటి హాలీవుడ్ నటులు ఫ్రాంక్ సినాట్రా, రాబర్ట్ వేగ్నర్, జేమ్స్ స్టివార్ట్, డీన్ మార్టిన్, బర్ట్ రేనాల్డ్స్ వంటి వారితో నటించి అలరించారు రాక్వెల్ వెల్చ్.
Also Read
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
Keanu Reeves: ఇంతకూ… కీనూ రీవ్స్‌కు ఏమయ్యింది!?
జేమ్స్ వెల్చ్ తో ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగాక, విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ తన పేరులో వెల్చ్ నే కొనసాగించారు. ఆ తరువాత కూడా మరో మూడు మార్లు రాక్వెల్ వివాహం చేసుకున్నా, రాక్వెల్ వెల్చ్ గానే ఆమె సాగారు. ఏది ఏమైనా రాక్వెల్ వెల్చ్ అందం ఆ రోజుల్లో హిందోళం పాడుతూ కుర్రకారుకు బంధాలు వేసింది. హాలీవుడ్ పత్రికలో ‘100 సెక్సియెస్ట్ స్టార్స్ ఇన్ ఫిలిమ్ హిస్టరీ’ లో చోటు సంపాదించారామె. 1995లో ‘ఎంపైర్ మేగజైన్’ ప్రచురించిన ‘100 సెక్సియెస్ట్ స్టార్స్ ఆఫ్ ట్వంటీయెత్ సెంచరీ’లో మూడో ర్యాంక్ సాధించారామె. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల కలల రాజ్యానికి రాణిగా సాగుతున్న రాక్వెల్ ను ఆమె చిత్రాలలోనే చూసుకోవాలి. అదే రాక్వెల్ కు ఫ్యాన్స్ అర్పించే అసలైన నివాళి!
తాజావార్తలు
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!