Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan Day 1 Box Office Collection: విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై నెలకొన్న సెన్సార్ వివాదాలు వీడి, ఎట్టకేలకు నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఫ్యాన్స్ కోలాహలం, విపరీతమైన హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశీయ మార్కెట్లో రూ.41 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ ట్రాకర్ ‘సాక్నిల్క్’ (Sacnilk) వెల్లడించింది.
కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
దేశవ్యాప్తంగా దాదాపు 13,067 షోల ద్వారా భారత్‌లో రూ.48.27 కోట్ల గ్రాస్ (రూ.41 కోట్లు నెట్) వసూలు చేసింది. ఇక విదేశాల్లో రూ.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భాషల వారీగా చూస్తే.. మాతృమాతృక తమిళంలో అత్యధికంగా రూ.36.50 కోట్లు రాగా, తెలుగు వెర్షన్ రూ.2.75 కోట్లు, హిందీ వెర్షన్ రూ.1.75 కోట్లు సాధించాయి. అయితే, విజయ్ మునుపటి చిత్రాలైన ‘బీస్ట్’ (రూ.49.30 కోట్లు), ‘గోట్’ (GOAT – రూ.44 కోట్లు) లీగ్ ఓపెనింగ్స్ లెక్కలను ‘జన నాయగన్’ దాటలేకపోయింది. అంతేకాకుండా తమిళ చిత్రసీమలో తొలిరోజు రూ.50 కోట్ల నెట్ మార్కును చేరుకున్న విజయ్ ‘లియో’ (రూ.64.80 కోట్లు), రజనీకాంత్ ‘కూలీ’ (రూ.65 కోట్లు), ‘కూలీ 2.0’ (రూ.60.25 కోట్లు) సరసన ఈ సినిమా నిలవలేకపోయింది.
Also Read
- Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
- Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
- Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
- YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
విడుదలకు ముందు ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా అంచనా వేస్తూ.. భారతదేశంలో రూ.60 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని, మొదటి వీకెండ్‌కు ఇండియాలో రూ.150–180 కోట్లు, వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ నిర్దిష్ట సంఖ్యలను చెప్పకపోయినా, ఘనమైన ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. హెచ్.వినోత్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్‌కి నటుడిగా చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!