Jan Dhan: 8 ఏళ్లలో 15 కోట్ల నుంచి 50 కోట్లకు జన్ ధన్ ఖాతాలు.. ఇప్పుడు వారికి బీమానే లక్ష్యం!
Jan Dhan: గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది. గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 3.34 రెట్లు పెరిగిందని, ఖాతాల్లో డిపాజిట్లు 13 రెట్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. జన్ ధన్ యోజన కింద మార్చి 31, 2015 వరకు 14.72 కోట్ల ఖాతాలు తెరవగా, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి వాటి సంఖ్య 50.9 కోట్లకు పెరిగింది. 2015 మార్చిలో జన్ ధన్ ఖాతాల్లో కేవలం రూ.15,670 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 16 వరకు జన్ ధన్ ఖాతాల్లో రూ.203,505 కోట్లు జమ అయ్యాయి.
Read Also: Kenya Power Outage: కరెంటు కోతలతో కెన్యా అతలాకుతలం.. 14 గంటలు చీకట్లోనే..
Also Read
- Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ఈ ఖాతాదారులందరినీ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) వంటి సూక్ష్మ బీమా పథకాలతో అనుసంధానించడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ ఎస్) కార్యదర్శి వివేక్ జోషి చెప్పారు. ఇందుకోసం బ్యాంకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రచారాలు కూడా నిర్వహిస్తూ గ్రామస్థాయిలో ఈ ఖాతాదారులకు పూర్తి సమాచారం అందజేస్తున్నారు.17.63 కోట్ల మంది ఖాతాదారులను పీఎంజేజీబీవై స్కీమ్‌తో అనుసంధానం చేయగా, 38.45 కోట్ల మంది ఖాతాదారులు పీఎంఎస్‌బీవైకి లింక్ అయ్యారని తెలిపారు. జన్ ధన్ ఖాతాదారులను కూడా డిజిటల్ చెల్లింపులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రయోజనం కోసం వారికి రూపే డెబిట్ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ వరకు మొత్తం 50.9 కోట్ల ఖాతాదారులలో 33.98 కోట్ల ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు జారీ చేయబడ్డాయి.
జన్-ధన్ ఖాతా అంటే ఏమిటి?
జన్ ధన్ ఖాతా జీరో బ్యాలెన్స్ ఖాతా, అంటే ఈ ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. జన్ ధన్ ఖాతాదారులకు వివిధ రకాల సమాచారాన్ని అందించేందుకు జన్ ధన్ దర్శక్ యాప్ (జేడీడీ) యాప్ కూడా ప్రారంభించబడింది. ఈ యాప్ ద్వారా ఖాతాదారులు సమీపంలోని ఏటీఎంల సమాచారాన్ని, పోస్టాఫీసులు, బ్యాంకుల బ్రాంచ్‌ల సమాచారాన్ని పొందగలుగుతారు. ఇప్పటి వరకు ఏయే చోట్ల బ్యాంకింగ్ ఖాతాలు తెరవలేదో బ్యాంకు తెలుసుకోవచ్చు.
ఏ సంవత్సరంలో ఎన్ని కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచారంటే?
14.72 కోట్ల ఖాతాలు- 2016
21.43- 2017
28.17- 2018
31.44- 2019
35.27- 2020
38.33- 2021
42.20- 2022
50.09- ఆగస్టు 16, 2023
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో