JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JMI VC Mazhar Asif: జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం ఢిల్లీలోని జామియా క్యాంపస్‌లో ఆర్ఎస్ఎస్ (RSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువ కుంభ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారతీయుల మూలాల గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారతీయులందరి డీఎన్ఏ (DNA) ఒక్కటేనని, అది ‘మహాదేవుని డిఎన్ఏ’ అని వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ.. “మీ అందరి మాతృభాషలు వేరు కావచ్చు, మీ సంప్రదాయాలు, సంస్కారాలు వేరుగా ఉండవచ్చు, కానీ మనమందరం భారతీయులం. ఎందుకంటే మన రక్తం, మన డీఎన్ఏలో పరమశివుని తాలూకు అంశ ఉంది” అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే సనాతన సంస్కృతి అత్యుత్తమమైనదని, అది అందరి హితాన్ని కోరుకుంటుందని కొనియాడారు.
వైస్ ఛాన్సలర్ తన వాదనను సమర్థించుకోవడానికి శివుని కుటుంబాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణగా చూపారు. కైలాస పర్వతంపై ఉండే మహాదేవుని కుటుంబంలో పరస్పర విరుద్ధమైన జీవులు ఎంతో సామరస్యంగా ఉంటాయని వివరించారు. “శివుని మెడలో పాము ఉంటుంది. వినాయకుడి వాహనం ఎలుక. పార్వతీ దేవి వాహనం సింహం. కార్తికేయుడి వాహనం నెమలి. అలాగే శివుని ముందు నంది ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా చూస్తే పాముకి ఎలుక ఆహారం, నెమలికి పాము ఆహారం, సింహానికి నంది ఆహారం. ఒకరికొకరు శత్రువులైనప్పటికీ.. వీరంతా మహాదేవుని ఇంట్లో కలిసికట్టుగా ఉంటారు. విభిన్న జాతులు, మతాలు, వర్గాలకు చెందిన మనం భారతీయులుగా కలిసి ఉండాలనేది సనాతన సంస్కృతి నేర్పే గొప్ప పాఠం” అని ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ స్పష్టం చేశారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
అయితే, ముస్లిం మైనారిటీ విద్యాసంస్థ అయిన జామియాలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఎన్ఎస్యూఐ (NSUI) సహా పలు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసనల సెగల మధ్య క్యాంపస్ వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. ఒకవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగానే, మరోవైపు విసి మజహర్ ఆసిఫ్ ఆర్ఎస్ఎస్ నాయకులను సాదరంగా ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడం, ‘మహాదేవ డిఎన్ఏ’ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!