Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
- 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్..
- హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
vaibhav Sooryavanshi: బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఈస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్‌జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెడ్‌బాల్ క్రికెట్లోనూ టీ20 తరహా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. అయితే 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇంతకుముందు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. ఆయన 1969లో 16 ఏళ్ల వయసులో దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ సాధించారు. తాజాగా వైభవ్ ఆ రికార్డును అధిగమించి తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత వైభవ్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 90 పరుగుల మార్క్‌ను కూడా దాటాడు. అయితే సెంచరీకి చేరువైన సమయంలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. అంతకుముందు 40 పరుగుల వద్ద వైభవ్ ఇచ్చిన క్యాచ్‌ను సెంట్రల్‌జోన్ ఫీల్డర్లు జారవిడిచారు. లభించిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వైభవ్ బౌలర్లపై మరింత విరుచుకుపడ్డాడు. అయితే చివరకు సెంచరీ మాత్రం మిస్ అయ్యింది. వైభవ్ సూర్యవంశీతో కలిసి ఓపెనింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ కూడా రాణించాడు. 70 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైభవ్ ఔటైన అనంతరం ఈశ్వరన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.
100-run stand 🙌
Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝
Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU
— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సెంట్రల్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్ 88 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. ఆర్య జుయల్ 113 బంతుల్లో 6 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్ కూడా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ చెరో రెండు వికెట్లు తీశారు.
HEARTBREAKING MOMENT FOR VAIBHAV SOORYAVANSHI !💔
Vaibhav Suryavanshi missed his maiden century in the Duleep Trophy by just 8 runs.
– Just look at the reaction of Vaibhav Suryavanshi 😭😭
pic.twitter.com/BYA3KPUSc3— lndian Sports Network (@IS_Netwrk29) August 31, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!